మూడు నెల‌ల టైమ్ ఇచ్చిన ర‌జ‌నీ

  • IndiaGlitz, [Thursday,June 07 2018]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌కు ఉండే క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక్క త‌మిళ‌నాటే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ, ఉత్త‌రాదిలోనూ, జపాన్‌లోనూ త‌న‌కంటూ ఓ అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్నారాయ‌న‌. ఇదిలా ఉంటే.. ఏడాది గ్యాప్‌లో మూడు సినిమాల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మవుతున్నారు ర‌జ‌నీ . ఆయ‌న తాజా చిత్రం కాలా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.. శంక‌ర్ కాంబినేష‌న్‌లో చేసిన 2.0 దీపావ‌ళికి రిలీజ్ అయ్యే అవ‌కాశ‌ముంది.

ఇక.. పిజ్జా ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న కొత్త చిత్రం ఇప్ప‌టికే డెహ్ర‌డూన్‌లో షూటింగ్ ప్రారంభించుకుంది. నెల రోజుల పాటు జ‌రిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్య ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా కోసం ర‌జ‌నీ మూడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే కేటాయించ‌నున్నారని తెలుస్తోంది. ఆ ప్ర‌కారమే.. షూటింగ్ ప్లాన్ చేసుకోమ‌ని ఆయ‌న చెప్పార‌ని.. ద‌ర్శ‌కుడు కార్తీక్ కూడా అందుకు త‌గ్గ‌ట్టే చ‌క‌చ‌కా నిర్మాణం పూర్త‌య్యే ప్లాన్ చేసుకున్నార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుద‌ల కానుంది.