మహేష్ కోసం రజనీ...
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సూపర్‌స్టార్ కోసం సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా ఓ వేడుకలో హాజరు కానున్నారు. ఇంతకు ఆ వేడుక మరేదో కాదు. సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పైడర్ మూవీకి సంబంధించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 9న చెన్నైలో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.
ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు మరోస్టార్ డైరెక్టర్ శంకర్ కూడా హాజరుకానున్నారని సమాచారం. ఎందుకంటే రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న రోబో సీక్వెల్ 2.0 సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సంస్థే స్పైడర్ తమిళ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకుందట. అందుకనే ఈ కార్యక్రమానికి రజనీకాంత్, శంకర్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com