రజనీ మరో సినిమా రిలీజ్ కూడా డౌటేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే తమిళనాట పండుగ వాతావరణం నెలకొంటుంది. అందుకే ఆయన సినిమాలను భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే... శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన '2.O' మూవీని తమిళ న్యూ ఇయర్ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఆ మధ్య వెల్లడించింది. కాని ఇంకా గ్రాఫిక్స్ కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమాని ఆగష్టు 15కు వాయిదా వేసారని సమాచారం.
దీంతో.. నిరాశ పడ్డ అభిమానులను ఉత్సాహపరచడానికి అన్నట్లుగా.. నిర్మాణానంతర పనులను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న 'కాలా'ను ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్లు రజనీ అల్లుడు ధనుష్ ప్రకటించారు. కానీ తీరా ఇప్పుడు ఈ సినిమా కూడా ఆలస్యమయ్యేలా ఉంది.
ఎందుకంటే తమిళ నిర్మాతలు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో కాలా సినిమాను కాస్త లేటుగానే రిలీజ్ చేయాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి. మరి చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధనుష్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments