మ‌ళ్లీ వెన‌క్కి వెళుతున్న‌ ర‌జినీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న సమయంలో కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగింది. తెలుగులో ద‌రువు, శంఖం, శౌర్యం చిత్రాల‌తో పాటు త‌మిళంలో వివేగం, విశ్వాసం, వీరం, వేదాళం చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ, కీర్తిసురేశ్‌, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే కరోనా వల్ల షూటింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో సినిమాను వచ్చే వేసవిలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌.

గ‌త ఏడాది సంక్రాంతికి జ‌న‌వ‌రి 9న ఎ.ఆర్‌.మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ద‌ర్బార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. మ‌రోసారి కూడా ర‌జినీకాంత్ సంక్రాంతి బ‌రిలోకే రావాల‌నుకున్న ర‌జినీకాంత్‌కు క‌రోనా బ్రేకులేసింది. డి.ఇమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. వెట్రి ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అజిత్‌తో సూప‌ర్‌హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ శివ ర‌జినీకాంత్‌ను ఎలా ప్రెజెంట్ చేయ‌బోతారోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.