రజనీకాంత్ సినిమా టైటిల్...

  • IndiaGlitz, [Thursday,July 23 2015]

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తన నెక్స్ ట్ మూవీని అట్టకత్తి', మద్రాస్' చిత్రాల ఫేమ్ డైరెక్టర్ రంజిత్ తో చేయడానికి రెడీ అయిపోయాడు. కొచ్చడయాన్', లింగ' చిత్రాలు ఆశించిన మేర విజయం సాధించక పోవడంతో రజనీకాంత్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో గ్యాంగ్ స్టర్ గా రజనీకాంత్ దర్శనమిస్తాడట. మలేషియా, సింగపూర్ లలో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంటుందని, రాధికాఅప్టే హీరోయిన్ గా నటిస్తుందని కూడా ఫిలింనగర్ వర్గాల బోగట్టా. తాజాగా ఈ చిత్రానికి కాళీ' అనే టైటిల్ పరిశీలనలో ఉందని అంటున్నారు. మరికొన్ని రోజులు ఆగితే సస్పెన్స్ వీడిపోతుంది.