సూపర్ స్టార్ గొప్ప మనసు
- IndiaGlitz, [Tuesday,December 01 2015]
అకాల వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులోని పలు చోట్ల పడుతున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల సబ్‌వేలను మూసి వేశారు. మరికొన్ని లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు చేరిపోతున్నాయి. ప్రభుత్వం హెల్ప్ లైన్లను కూడా ప్రకటించింది. స్కూళ్ళకు, ఇతర విద్యా సంస్థలకు కూడా సెలవులను ప్రకటించారు.
ఈ విషయాలను గురించి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. కబాలి షూటింగ్, రోబో2 ఫోటో షూట్లో బిజీగా ఉన్నప్పటికీ రజనీకాంత్ వర్ష సమాచారాన్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయన తన శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.పదిలక్షల రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలు తమిళంలో ఆడుతున్నాయి. దానికి తోడు తమిళనాడులో తెలుగు ప్రజల సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలు కూడా విరాళాలను ప్రకటిస్తారేమో వేచి చూడాలి మరి. హుద్‌హుద్ తుఫాను మన దగ్గర బీభత్సాన్ని సృష్టించిన సమయంలో తమిళ హీరోలు స్పందించిన తీరు మరువలేనిది.