సూపర్ స్టార్ గొప్ప మనసు

  • IndiaGlitz, [Tuesday,December 01 2015]

అకాల వ‌ర్షాల‌తో చెన్నై అత‌లాకుత‌ల‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోని ప‌లు చోట్ల ప‌డుతున్న వ‌ర్షాల కార‌ణంగా రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మై క‌నిపిస్తున్నాయి. కొన్ని చోట్ల స‌బ్‌వేల‌ను మూసి వేశారు. మ‌రికొన్ని లోత‌ట్టు ప్రాంతాల‌కు నీళ్ళు చేరిపోతున్నాయి. ప్ర‌భుత్వం హెల్ప్ లైన్ల‌ను కూడా ప్ర‌క‌టించింది. స్కూళ్ళ‌కు, ఇత‌ర విద్యా సంస్థ‌ల‌కు కూడా సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాల‌ను గురించి త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఎప్ప‌టిక‌ప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. క‌బాలి షూటింగ్, రోబో2 ఫోటో షూట్‌లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ర‌జ‌నీకాంత్ వ‌ర్ష స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు క‌నుక్కుంటున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయ‌న త‌న శ్రీ రాఘ‌వేంద్ర చారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున రూ.ప‌దిల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని కూడా ప్ర‌క‌టించారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలు త‌మిళంలో ఆడుతున్నాయి. దానికి తోడు త‌మిళ‌నాడులో తెలుగు ప్ర‌జ‌ల సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేప‌థ్యంలో తెలుగు హీరోలు కూడా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తారేమో వేచి చూడాలి మ‌రి. హుద్‌హుద్ తుఫాను మ‌న ద‌గ్గ‌ర బీభ‌త్సాన్ని సృష్టించిన స‌మ‌యంలో త‌మిళ హీరోలు స్పందించిన తీరు మ‌రువ‌లేనిది.

More News

99 వెహికిల్స్ పై బాలయ్య ఫ్యాన్స్...

నందమూరి నట సింహంబాలక్రిష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్.ఈ చిత్రాన్నిశ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ శ్రీవాస్ తో కలసి ఈ చిత్రాన్నినిర్మిస్తుంది.

7న వ‌రుణ్ నిశ్చితార్థం

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరో వ‌రుణ్ సందేశ్‌. ఆ త‌ర్వాత కొత్త‌బంగారులోకం ఆయ‌న‌కు కెరీర్‌లో చాలా పెద్ద హిట్.

2 నుంచి స్పెయిన్ లో తారక్!

ఎన్టీఆర్,సుకుమార్ కాంబినేషన్ లో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం'నాన్నకు ప్రేమతో..'.

దాత సుమంత్‌!

తెలుగులో వీర్య‌దానానికి సంబంధించిన దాత‌గా చివ‌రికి సుమంత్ పేరు ఫిక్స్ అయింది. హిందీలో బాగా హిట్ అయిన సినిమా విక్కీ డోనార్‌.

ఆర్య హీరోగా 'సామ్రాజ్యం'

ప్రతి మనిషి పుట్టుకకూ ఓ కారణం ఉంటుంది.తప్పకుండా పుట్టిన ప్రతిమనిషీ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తాడు...ఈ నేపథ్యంలో ఆర్య హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కింది.