ఆసుపత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆదివారం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రజినీ ఆరోగ్య రీత్యా పలు సూచనలు చేసిన మీదట ఆయనను నేడు వైద్యులు డిశ్చార్జ్ చేశారు. రజినీ కోలుకునేందుకు కొన్ని సూచనలు చేశారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజినీకాంత్‌కు వైద్యుల సూచించారు. ఒత్తిడికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గతంలో అయినందున మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు రజినీకి సూచించారు.
‘‘డిసెంబర్ 20న తీవ్రమైన హైపర్ టెన్షన్‌తో రజినీకాంత్ గారు ఆసుపత్రిలో చేరారు. మా వైద్య బృందం ఆయనకు చికిత్సను అందించింది. ప్రస్తుతం ఆయన బీపీ నిలకడగానే ఉంది. ఆయన చాలా బెటర్‌గా ఫీలవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో ఆయనను నేడు డిశ్చార్జ్ చేశాం.
గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయినందున.. కింది సూచనలు, డైట్‌ను ఆయనకు సూచించాము.
1. వారంపాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి.
2. ఏదో ఒక చిన్న చిన్న వ్యాయామం చేస్తూ ఉండాలి. ఒత్తడిని తగ్గించుకోవాలి.
అలాగే.. కోవిడ్-19 కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రజినీకి సూచించినట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు.
కాగా.. రజినీకాంత్ కాసేపట్లో చెన్నైకి ఆయన బయలుదేరనున్నారు. తమిళ సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చిత్రబృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో చిత్రీకరణ నిలిపివేశారు. ఈ నెల 22న రజినీకాంత్ కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com