ఆసుపత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్..

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ఆదివారం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రజినీ ఆరోగ్య రీత్యా పలు సూచనలు చేసిన మీదట ఆయనను నేడు వైద్యులు డిశ్చార్జ్ చేశారు. రజినీ కోలుకునేందుకు కొన్ని సూచనలు చేశారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజినీకాంత్‌కు వైద్యుల సూచించారు. ఒత్తిడికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గతంలో అయినందున మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు రజినీకి సూచించారు.

‘‘డిసెంబర్ 20న తీవ్రమైన హైపర్ టెన్షన్‌తో రజినీకాంత్ గారు ఆసుపత్రిలో చేరారు. మా వైద్య బృందం ఆయనకు చికిత్సను అందించింది. ప్రస్తుతం ఆయన బీపీ నిలకడగానే ఉంది. ఆయన చాలా బెటర్‌గా ఫీలవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో ఆయనను నేడు డిశ్చార్జ్ చేశాం.

గతంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయినందున.. కింది సూచనలు, డైట్‌ను ఆయనకు సూచించాము.

1. వారంపాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి.

2. ఏదో ఒక చిన్న చిన్న వ్యాయామం చేస్తూ ఉండాలి. ఒత్తడిని తగ్గించుకోవాలి.

అలాగే.. కోవిడ్-19 కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రజినీకి సూచించినట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు.

కాగా.. రజినీకాంత్ కాసేపట్లో చెన్నైకి ఆయన బయలుదేరనున్నారు. తమిళ సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌ కోసం రజినీకాంత్‌ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అయితే చిత్రబృందంలో కొందరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో చిత్రీకరణ నిలిపివేశారు. ఈ నెల 22న రజినీకాంత్‌ కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

More News

ఆలియాపై కేసు నమోదు...

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆలియా భట్ 'గంగూబాయ్‌ కతియావాడి' అనే సినిమాలో నటిస్తోంది.

చందమామపై స్థలాన్ని కొని భార్యకు కానుకిచ్చాడు..

భార్యకు పెళ్లిరోజు కానుక ఏమివ్వాలా? అని ఓ భర్త ఆలోచించాడు. ఏముంటుంది.. ఏ బంగారు నెక్లెస్సో..

బిగ్‌బాస్ షోపై కేసు వేస్తా.. నాగార్జున క్షమాపణ చెప్పాలి: నారాయణ

టాలీవుడ్ సీనియర్ హీరో, బిగ్‌బాస్ వ్యాఖ్యత నాగార్జునపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఆచార్య’ సెట్స్‌లో రామ్ చరణ్..

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు.. ఆర్య రాజేంద్రన్..

21 ఏళ్ల వయసు.. ఇంజినీరింగ్ చదువుతోంది. ఎవరైనా ఏం అనుకుంటారు? ఇంజినీరింగ్ పూర్తైతే ఐదంకెల్లో జీతం..