రజనీ కుమార్తె వివాహం
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ రెండో వివాహం త్వరలోనే జరగనుంది. నటుడు, ఫార్మా కంపెనీ యజమాని విషగన్ వనగమూడితో సౌందర్య వివాహం ఫిబ్రవరి 11న వివాహం జరగనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇటీవల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరికి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో జరగబోయే వివాహ వేడుకను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.
2010లో అశ్విన్ అనే వ్యాపారవేత్తతో సౌందర్య వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 2017లో మనస్పర్ధలతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments