రజనీకాంత్ కు కోర్టు సమన్లు..

  • IndiaGlitz, [Tuesday,March 08 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా కె.ఎస్.ర‌వికుమార్ తెర‌కెక్కించిన చిత్రం లింగా. ర‌జ‌నీకాంత్, అనుష్క‌, సొనాక్షి సిన్హా కాంబినేష‌న్లో రూపొందిన ఈ చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే ఈ చిత్ర క‌థ మాత్రం వివాద‌స్ప‌ద‌మై ఇప్ప‌టికీ కోర్టులోనే ఉంది.
ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... త‌ను రాసుకున్న క‌థ‌ను త‌న అనుమ‌తి లేకుండా లింగా సినిమాగా తీసార‌ని మ‌ధురై కోర్టులో ర‌చ‌యిత కెఆర్ ర‌వి ఫిర్యాదు చేసారు. దీంతో ర‌జ‌నీకాంత్ కి మ‌ధురై కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ర‌జ‌నీకాంత్ తో పాటు డైరెక్ట‌ర్ కె.ఎస్.ర‌వికుమార్, నిర్మాత రాక్ లైన్ వెంక‌టేష్, ర‌చ‌యిత బి. పోన్ కుమార్ కు కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 30వతేదీలోగా విచారణ పూర్తి చేయాలని మద్రాస్‌ హైకోర్టు మధురై మున్సిఫ్ కోర్టు జడ్జిని ఆదేశించింది.