హృతిక్ రోషన్ ను అభినందించిన రజనీకాంత్

  • IndiaGlitz, [Wednesday,December 21 2016]

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే యావత్ భారతదేశంలో క్రేజ్ ఉన్న వ్యక్తి. అటువంటి స్టార్ మన్ననలను పొందటం బాలీవుడ్ హీరోల‌కు కూడా గర్వకారణం. ఇప్పుడు రజినీకాంత్ ప్రశంశలను అందుకోవటం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వంతు అయ్యింది. హృతిక్ రోష‌న్ నటించిన బలం చిత్రం ట్రైలర్ లను, పాటలను చూసిన రజనీకాంత్,హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తో ఈ విషయాన్ని వెల్లడించారు. హృతిక్ నటనను, ప్రతిభను ఆయన ప్రత్యేకంగా పొగిడారు. ఈ వార్త విన్న హృతిక్ రోషన్ ఎంతగానో ఆనందించి రజినీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
రజనీకాంత్, హృతిక్ రోష‌న్ తండ్రి రాకేష్ రోషన్ ల మ‌ధ్య‌ 30 సంవత్సరాల అనుబంధం. హృతిక్ రోషన్ తాతగారు జె ఓం ప్రకాష్ తీసిన "భగవాన్ దాదా" చిత్రంతో వీరిద్దరి బంధం ఏర్పడింది. ఆస‌క్తికర విషయం ఏమిటంటే...హృతిక్ రోషన్ కి మొట్టమొదటి డైలాగ్ ఉన్న చిత్రం ఇదే కావటం విశేషం. అప్పుడు హృతిక్ రోష‌న్ వయసు 12 సంవత్సరాలు.
ప్రపంచ వ్యాప్తం గా జనవరి 25 న కాబిల్ చిత్రం విడుదల కాబోతోంది. ఇదే చిత్రం తెలుగు లో బలం టైటిల్ తో వస్తోంది. హృతిక్ రోష‌న్ , యామి జంటగా నటించిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ను సంజయ్ గుప్తా డైరెక్ట్ చేయగా, రాకేష్ రోషన్ నిర్మించారు. రాజేష్ రోషన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం లో హృతిక్ రోష‌న్, యామి ఇద్దరూ అంధులు గా నటించటం విశేషం.