తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు రజనీ వివరణ....

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం పై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న‌విష‌యం తెలిసిందే. ర‌జ‌నీ ఆరోగ్యం పై వార్త‌లు రావ‌డంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండ‌స్ట్రీలో ర‌జ‌నీకాంత్ కు అస‌లు ఏం అయ్యింది అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే... అమెరికా నుంచి ఇటీవ‌ల చెన్నై వ‌చ్చిన ర‌జ‌నీకాంత్ త‌న ఆరోగ్యం గురించి వ‌స్తున్న వార్త‌ల పై క్లారిటీ ఇచ్చేసారు. త‌న ఆరోగ్యంతో పాటు క‌బాలి గురించి స్వ‌యంగా లేఖ రాసి మీడియాకు అంద‌చేసారు. ఈ లేఖ‌లో ర‌జ‌నీకాంత్ ఏం రాసారంటే...శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రోబో 2.0, భావోద్వేగాలు గ‌ల విభిన్న‌క‌థా చిత్రం క‌బాలి ఈ రెండు చిత్రాల్లో వ‌రుస‌గా పాల్గొన‌డం వ‌ల‌న శారీర‌కంగా, మాన‌సికంగా అల‌సిపోయాను.
దీనిని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌నిపించి నా కూతురు ఐశ్వ‌ర్య తో క‌లిసి రెండు నెల‌లు అమెరికా వెళ్లాను. అక్క‌డ వైద్య ప‌రీక్ష‌లు కూడా చేయించుకున్నాను. నా మాతృదేశానికి వ‌చ్చాకా నాకు కొత్త బ‌లం వ‌చ్చిన‌ట్టు అనిపించింది. ఇక‌ క‌బాలి విజ‌యం గురించి విన్నాకా మ‌న‌సు మ‌రింత ప్ర‌శాంతంగా మారింది. నా మిత్రుడు థ‌ను, క‌బాలి ద‌ర్శ‌కుడు రంజిత్, చిత్ర‌యూనిట్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను. అలాగే నా ప్రియ‌మైన అభిమానుల‌కు, మీడియా ప్ర‌తినిధుల‌కు, ప్ర‌జ‌ల‌కు, ధియేట‌ర్ల యజ‌మ‌నుల‌కు, పంపిణీదారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అని స్వ‌యంగా లేఖ‌లో రాసారు.

More News

రజనీ నీకిదే నా వందనం అంటున్న బాలీవుడ్ స్టార్..

సూపర్ స్టార్ రజనీకాంత్..రేంజ్ ఏమిటో..?ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

చుట్టాల‌బ్బాయి టీమ్ స‌మ‌క్షంలో జ‌రిగిన‌ సాయికుమార్ జ‌న్మ‌దిన వేడుక‌

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ తెర‌కెక్కించిన చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ఓ ముఖ్య‌పాత్ర పోషించారు. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై రామ్ తాల్లూరి, వెంక‌ట్ త‌లారి  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

'నీ జతలేక' ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక

నాగశౌర్య, పారుల్‌, సరయు హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'నీజతలేక'. స్వరాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చిందని చిత్రయూనిట్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకను నిర్వహించారు.

వైశాఖం యూనిట్ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన‌ హీరో హ‌రీష్ జ‌న్మ‌దిన వేడుక‌లు

చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ వంటి హిట్‌ చిత్రాల తర్వాత డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వైశాఖం.

అభినేత్రి విడుదల తేదీ ఖరారు

ప్రభుదేవా,తమన్నా,సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం అభినేత్రి.