Devil:రజినీకాంత్ బర్త్‌డే ట్రీట్.. కల్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' మూవీతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు. బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్లు వసూలు చేసి రజినీ స్టామినా ఏంటో నిరూపించింది. ఇక తాజాగా ‘జై భీమ్’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ‘తలైవర్ 170’ వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇవాళ రజిని బర్త్ డే కావడంతో మూవీ టీం టైటిల్‌ని అనౌన్స్ చేస్తూ ఓ టీజర్ విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘వేటైయాన్’ అనే పేరు పెట్టారు.
ఇక ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ కీలక నేతలు నటిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 33 సంవత్సరాల తర్వాత రజనీ, అమితాబ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. సంయుక్తా మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఆద్యంతం ఆకట్టుకున్న ట్రైలర్ చివర్లో "విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా... లయన్" అంటూ హీరో పౌరుషంతో మీసం మెలేయడం మూవీపై అంచనాలు నెలకొనేలా చేసింది.
ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఇప్పటికే డెవిల్ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం డిసెంబరు 29న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments