Devil:రజినీకాంత్ బర్త్‌డే ట్రీట్.. కల్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,December 12 2023]

సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' మూవీతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు. బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.600కోట్లు వసూలు చేసి రజినీ స్టామినా ఏంటో నిరూపించింది. ఇక తాజాగా ‘జై భీమ్‌’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ‘త‌లైవర్ 170’ వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటుంది. ఇవాళ రజిని బర్త్ డే కావడంతో మూవీ టీం టైటిల్‌ని అనౌన్స్ చేస్తూ ఓ టీజర్ విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘వేటైయాన్’ అనే పేరు పెట్టారు.

ఇక ఈ సినిమాలో బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌ కీలక నేతలు నటిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు 33 సంవత్సరాల తర్వాత రజనీ, అమితాబ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు నందమూరి హీరో కల్యాణ్‌ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు మూవీ మేకర్స్. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నారు. సంయుక్తా మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఆద్యంతం ఆకట్టుకున్న ట్రైలర్ చివర్లో విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా... లయన్ అంటూ హీరో పౌరుషంతో మీసం మెలేయడం మూవీపై అంచనాలు నెలకొనేలా చేసింది.

ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఇప్పటికే డెవిల్ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రం డిసెంబరు 29న విడుదల కానుంది.

More News

Rajasthan CM:రాజస్థాన్‌ సీఎంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే.. బీజేపీ సంచలన నిర్ణయం..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 9 రోజుల తర్వాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

KCR:మీకు దండం పెడతా.. పరామర్శకు ఎవరూ రావొద్దు: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

Pawan Kalyan:పవర్‌ స్టార్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అప్పటి దాకా ఆగాల్సిందే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. మొన్నటివరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన..

Holidays in Telangana:తెలంగాణలో వచ్చే ఏడాది సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

వచ్చే ఏడాదికి సంబంధించి సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 27 సాధారణ సెలవులు,

CP Srinivas Reddy:హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్‌రెడ్డి.. పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ..

పాలనలో తనదైన ముద్ర వేసేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు తన టీమ్‌ను సిద్ధం చేస్తున్నారు.