తలైవా ‘అణ్ణాత్తే’ రిలీజ్ డేట్ ఖరారు
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ‘అణ్ణాతే’. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ‘అణ్ణాతే’ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 4న అణ్ణాత్తే సినిమాను విడుదల చేయబోతున్నట్లు యూనిట్ తెలియజేసింది. మరి ఈ సినిమా తర్వాత రజినీకాంత్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడనేది క్లారిటీ లేదు. సినిమాల నుంచి కూడా తలైవా రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి అణ్ణాత్తే షూటింగ్‌ను పూర్తి చేసి తదుపరి రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయాలని అనుకున్నాడు. అన్నీ సక్రమంగా జరిగి ఉండుంటే ఈరోజు రజనీకాంత్ తన పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి ఉండేవాడు. కానీ ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. డాక్టర్స్ మానసిక ఆందోళనలు పెట్టుకుంటే కష్టమని సూచించడంతో రజినీకాంత్ ఆలోచించి రాజకీయాల తప్పుకుంటున్నట్లు ప్రకటన ఇచ్చేశాడు. ఇక ఎలాగూ రాజకీయాల్లోకి రావడం లేదు కాబట్టి.. సినిమాల మీదనే తలైవా ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట. అయితే ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న తలైవాను వీలైనంత త్వరగా పూర్తి చేసేయాలనే రజినీకాంత్ ఆలోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగా ఫిబ్రవరి నుంచి ‘అణ్ణాత్తే’ షూటింగ్‌ను స్టార్ట్ చేద్దామని నిర్మాతలకు, దర్శకుడికి చెప్పేశాడట. అయితే షెడ్యూల్‌ను చెన్నైలోనే ప్లాన్ చేయమని సూచించాడట. అందుకు నిర్మాతలు కూడా ఒప్పుకున్నాడట. డెబ్బై శాతం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com