Rajinikanth, Kamal Haasan:ఒకే సెట్‌లో రజనీకాంత్, కమల్ హాసన్.. ఫొటోలు వైరల్..

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

భారతీయ సినీ చరత్రలో లెజెండ్స్‌గా నిలిచిపోయిన సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే సెట్‌పై కలిశారు. దీంతో ఇద్దరు ఆత్మీయంగా పలకరించకుంటూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం కమల్ హీరోగా లైకా ప్రొడెక్షన్స్ బ్యానర్ మీద దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్2' సినిమా షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతోంది. ఇదే సమయంలో రజనీ హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న తలైవర్ 170 సినిమా షూటింగ్ కూడా అదే స్టూడియోలో జరుపుకుంటుంది.

ఈ విషయం తెలుసుకున్న కమల్ హాసన్.. రజనీ సినిమా సెట్‌కు వెళ్లి సూపర్‌స్టార్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. కమల్‌ను చూసిన రజనీ ఆనందంతో కౌగిలించుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు లెజెండ్స్‌ను ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకుముందు బాబా, పంచతంత్రం సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు వీరిద్దరు సెట్‌లో కలుసుకున్నారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఇద్దరూ ఒకే సెట్‌లో కలవడం విశేషం. గతంలో ఈ ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇద్దరు మరోసారి కలిసి ఒకే సినిమాలో నటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇద్దరు లెజెండ్స్ మల్టీసారర్ పాన్ ఇండియా మూవీ చేస్తే రికార్డులు బద్దలు కావడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఇటీవల జైలర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్.. వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. ప్రస్తుతం ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇటీవల విడులైన ఈ మూవీ టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక కమల్ హాసన్‌ 'విక్రమ్' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఇండియన్‌2తో పాటు మణిరత్నం మూవీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.