Rajinikanth:ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్ : రజనీతో కలిసి నటించనున్నఅమితాబ్, 32 ఏళ్ల తర్వాత సెట్ అయిన కాంబో
Send us your feedback to audioarticles@vaarta.com
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్.. భారతదేశం గర్వించదగ్గ నటులు. 70 ప్లస్‌లోనూ ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు వీరిద్దరూ. ఈ వయసులోనే పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమంటూ కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతటి స్టార్ డమ్ వున్నా.. నేటికీ ఎంతో వినియంగా వుంటారు ఈ ఇద్దరు సూపర్స్టార్లు. షూటింగ్ వుంటే వెళ్లడం లేదంటే పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వుంటారు. ఇక రజనీ అయితే సినిమాలు లేకపోతే హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడతారు. భారతదేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ వీరికి అభిమానులు వున్నారు. అలాంటి ఈ ఇద్దరు లెజెండ్స్ ఓ సినిమా చేయనున్నారు.
గతంలో హిందీ సినిమాల్లో కలిసి నటించిన రజనీ, అమితాబ్ :
అమితాబ్, రజనీల మధ్య దశాబ్ధాల స్నేహం వుంది. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. 'అంధా కానూన్', 'గేరేఫ్తార్', 'హమ్'లో వీరి నటించారు. అలాంటిది దాదాపు 32 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు సూపర్స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో Thalaivar 170 తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీ రోల్ పోషించనున్నారట. ఈ సినిమాలో రజనీ.. రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని చెన్నై టాక్. జూలై చివరి నుంచి ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.
జైలర్ షూటింగ్ పూర్తి చేసిన రజనీ :
ఇదిలావుండగా.. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశారు తలైవా. ఆ వెంటనే తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాల్ సలాంలో గెస్ట్ రోల్లో ఆయన నటిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్‌లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. మొన్నామధ్య ముంబైలో జరిగిన షూటింగ్ సెట్స్‌కి భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ విచ్చేసి రజనీతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments