బ్రేకింగ్: రజినీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలోకి తరలింపు

సూపర్ స్టార్ రజినీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చిత్రబృందంలోని ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో షూటింగ్‌ను నిలిపివేశారు. అప్పటి నుంచి రజినీ హైదరాబాద్‌లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా.. నేడు సడెన్‌గా ఆయనకు బీపీ పెరగిందని తెలుస్తోంది. వెంటనే ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారని సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

షూటింగ్ వాయిదా పడటంతో ఆయన తమిళనాడుకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయనకు తీవ్రమైన రక్తపోటు, ఎక్సాషన్ కారణంగా రజినీ బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను అపోలోకు తరలించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా రజినీకాంత్‌తోపాటే సాయంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. ‘అన్నాత్తే’ సినిమాను ఎలాగైనా జనవరి నాటికి పూర్తి చేసి.. రాజకీయ ఆరంగేట్రం చేయాలనే యోచనలో రజినీ ఉన్నారు. ముఖ్యంగా రజినీతో తెరకెక్కించాల్సిన సన్నివేశాలన్నీ శరవేగంగా చిత్రబృందం తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేసింది. కొంత భాగం పూర్తైన తరుణంలో షూటింగ్‌లో కరోనా కల్లోలం రేపింది. దీంతో రజినీకాంత్ కూడా సెల్ఫ్ క్వారంటైన్‌‌లో ఉన్నారు.

More News

టక్ జగదీష్’ ఫస్ట్‌లుక్‌ విడుదల..

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చేస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి అద్భుతమైన హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన థియేటర్లు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మంచి రోజు కావడంతో థియేటర్ల యాజమాన్యం నేటి నుంచి థియేటర్లను పునః ప్రారంభించింది.

అల్లు అర్జున్ నాకు లైన్ వేసేవాడు: నటి షాకింగ్ కామెంట్స్

వనితా విజయ్ కుమార్.. ఆమె సినిమాల్లో నటించే సమయంలో ఎందరికి తెలుసో.. తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఫిక్స్..!

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పేరు ఫిక్స్ అయిందా? అంటే ఆ పార్టీ నేతల నుంచి అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది.

దేశ ప్రధానికి వ్యతిరేకంగా కోర్టులో దావా.. రూ.900 కోట్లు డిమాండ్..

దేశ ప్రధానికి ఝలక్ ఇచ్చిన ప్రజానీకాన్ని ఎక్కడైనా చూశారా? ఎన్నికల్లో అయితే ఓకే కానీ.. దేశ ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలే కోర్టు మెట్లక్కడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం.