నిప్పురా..! లో నటిస్తున్న రజనీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కబాలి. ఈ చిత్రంలో నిప్పు రా...! అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తమిళ్ లో నెరుప్పు డా అంటే తెలుగులో నిప్పురా అని అర్ధం. ఇప్పుడు నెరుప్పుడా అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరో విక్రమ్ ప్రభు ఫైర్ సర్వీస్ లో వర్క్ చేస్తుంటాడు. పైగా రజనీ అభిమానిగా నటిస్తున్నాడట. అందుచేత ఓ సన్నివేశంలో హీరో విక్రమ్ ప్రభుకి తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీ కనిపిస్తాడట. ఈ సన్నివేశం గురించి రజనీకి చెప్పి మీరు నటించాలి అని అడగారట చిత్ర బృందం. శివాజీ గణేషణ్ కుటుంబంతో రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉండడంతో వెంటనే ఓకే చెప్పారట. నూతన దర్శకుడు బి.అశోక్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com