పాటల చిత్రీకరణలో రజనీ 2.0
Friday, December 23, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ - గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రోబో సీక్వెల్ గా రూపొందుతున్న భారీ చిత్రం 2.0 ఈ చిత్రాన్నిలైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా, అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటను ఉత్తరప్రదేశ్ లో చిత్రీకరించనున్నట్లు సమాచారం. జ్ఞానేశ్వర్ మిశ్రా పార్కు, గోమతి నది తదితర ప్రాంతాల్లో ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ చలనచిత్రాభివృద్ది మండలి ఉపాధ్యక్షుడు గౌరవ్ ద్వివేది తెలియచేసారు.గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఉత్తరప్రదేశ్ లో షూటింగ్ జరపుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. ఈ భారీ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments