'2.0' ఈ ఏడాది లేనట్లేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
శివాజీ, రోబో చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంబినేషన్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాప్ డైరెక్టర్ శంకర్ ది. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రం '2.0'. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. శంకర్ గత చిత్రం 'ఐ'లో కథానాయికగా నటించిన ఎమీ జాక్సన్ ఇందులో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. డబుల్ ఆస్కార్ అవార్డ్స్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నారు.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా గ్రాఫిక్స్ వర్క్ జరుపుకోవాల్సి ఉంది. అయితే ఇంకా గ్రాఫిక్స్ వర్క్ మొదలు కాలేదని వార్తలు వినపడుతున్నాయి. సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. ఇటీవల సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేస్తారని అన్నారు. కానీ గ్రాఫిక్స్ పనులు కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతుంది. అందువల్ల 2.0 విడుదల మరింత ఆలస్యం అయ్యేలా కనపడుతుంది. వినపడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తారట. ఈ ఏడాది చివరలో సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com