రజనీ 2.0 అతిథులుగా
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నవంబర్ 20న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ముంబాయిలో ఆరుకోట్ల ఖర్చుతో గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈ వేడుకకు కమల్ హాసన్, షారూఖ్‌ఖాన్ ముఖ్యఅతిథులుగా హాజరవుతారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments