ర‌జ‌నీకాంత్ 2.0 ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,October 10 2016]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్,ఎమీజాక్స‌న్‌ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రీసెంట్‌గా పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌, ఎమీజాక్స‌న్‌ల‌పై సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను న‌వ‌బ‌ర్ 20న విడుల చేస్తార‌ని తెలిసింది. అక్ష‌య్‌కుమార్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. 2010లో ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రోబో ఎంత‌టి సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్‌పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఈ సినిమాను అక్టోబ‌ర్ 19, 2017న విడుద‌ల చేస్తార‌ని కూడా ఫిలింవ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.