రజనీ - శంకర్ ల 2.0 ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ - గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 2.0. రోబో చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 2.0 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుండగా..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇదిలా ఉంటే...ఈరోజు డైరెక్టర్ శంకర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ రాజు మహలింగమ్ రజనీ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ...రాజు మహలింగమ్ చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటంటే..నవంబర్ లో 2.0 ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేసారు. 2010లో రోబోతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీ - శంకర్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com