ఈరోజు సింహంలా గర్జించిన రజనీ..

  • IndiaGlitz, [Friday,July 01 2016]

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు గ‌త కొన్ని రోజులుగా కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా రజనీకాంత్ కు అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారంటూ ప్ర‌చారం ఎక్కువ్వ‌డంతో... ర‌జ‌నీ అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది.
దీంతో ర‌జ‌నీ ఆరోగ్యం గురించి ఇటీవ‌ల ర‌జ‌నీ సోద‌రుడు స‌త్యనారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ...ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని..ప్ర‌స్తుతం కేవ‌లం వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం అమెరికా వెళ్లార‌ని తెలిపారు. ఇదిలా ఉంటే...ఈరోజు ర‌జ‌నీకాంత్ సింహంలా గ‌ర్జించార‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే...ఈరోజు ఉద‌యం ర‌జనీకాంత్ ఫోన్ చేసి సింహంలా గ‌ర్జించార‌ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ క్రియేటివ్ హెడ్ రాజు మ‌హాలింగం ట్వీట్ చేసారు. ఇప్ప‌టికైనా పుకార్ల‌కు ఫుల్ స్టాఫ్ పెడ‌తార‌ని ఆశిస్తున్నాను అన్నారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ రోబో 2.0 చిత్రాన్ని నిర్మిస్తుంది.