‘ఆచార్య’ సినిమా కమిటీపై లీగల్ యాక్షన్ తీసుకోనున్న రాజేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తు్నారు. ఈ సినిమా కథ వివాదంలో రీసెంట్‌గా పెద్ద దుమారమే చేలరేగింది. తన కథను కొరటాల శివ చౌర్యం చేశారని రాజేశ్ మండూరి మీడియాకెక్కారు. తను కథను తీసుకుని పలు నిర్మాణ సంస్థలను కలిశానని అన్నారు రాజేశ్ మండూరి. గొడవ తర్వాత తాను పలువురు సినీ సెలబ్రిటీలను కలిశానని కానీ.. ఎవరూ తనకు సపోర్ట్ చేయలేదని రాజేశ్ చెప్పారు.
డిస్‌ప్యూట్ కమిటీకి స్క్రిప్ట్, వన్ లైన్ ఆర్డర్‌ను రాజేశ్ అప్పగించాడట. ఈ కమిటీ కొరటాల శివ స్క్రిప్టుతో తన స్క్రిప్టును చెక్ చేస్తారని భావించాడట. అయితే సదరు కమిటీ ఆ స్క్రిప్టును కొరటాల శివకు పంపిందట. ఈ విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ డిస్‌ప్యూట్ కమిటీపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారట. తన దగ్గరున్న ఆధారాలతో కోర్టు మెట్లు ఎక్కాలని రాజేశ్ భావిస్తున్నాడట. చిరంజీవి తన సమస్యను తెలుసుకుని పాజిటివ్‌గా రియాక్ట్ అవుతాడని కూడా రాజేశ్ చెప్పాడట. గతంలోనూ శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల కథల విషయంలోనూ కొరటాల శివపై ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments