‘ఆచార్య’ సినిమా క‌మిటీపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోనున్న రాజేశ్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తు్నారు. ఈ సినిమా క‌థ వివాదంలో రీసెంట్‌గా పెద్ద దుమార‌మే చేల‌రేగింది. త‌న క‌థ‌ను కొర‌టాల శివ చౌర్యం చేశార‌ని రాజేశ్ మండూరి మీడియాకెక్కారు. త‌ను క‌థ‌ను తీసుకుని ప‌లు నిర్మాణ సంస్థ‌ల‌ను క‌లిశాన‌ని అన్నారు రాజేశ్ మండూరి. గొడ‌వ త‌ర్వాత తాను ప‌లువురు సినీ సెల‌బ్రిటీల‌ను క‌లిశాన‌ని కానీ.. ఎవ‌రూ త‌న‌కు స‌పోర్ట్ చేయ‌లేద‌ని రాజేశ్ చెప్పారు.

డిస్‌ప్యూట్ క‌మిటీకి స్క్రిప్ట్, వ‌న్ లైన్ ఆర్డ‌ర్‌ను రాజేశ్ అప్ప‌గించాడ‌ట‌. ఈ క‌మిటీ కొర‌టాల శివ స్క్రిప్టుతో త‌న స్క్రిప్టును చెక్ చేస్తార‌ని భావించాడ‌ట‌. అయితే స‌ద‌రు క‌మిటీ ఆ స్క్రిప్టును కొర‌టాల శివ‌కు పంపింద‌ట‌. ఈ విషయం తెలుసుకున్న చిత్ర యూనిట్ డిస్‌ప్యూట్ క‌మిటీపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. త‌న ద‌గ్గ‌రున్న ఆధారాల‌తో కోర్టు మెట్లు ఎక్కాల‌ని రాజేశ్ భావిస్తున్నాడట‌. చిరంజీవి త‌న స‌మ‌స్య‌ను తెలుసుకుని పాజిటివ్‌గా రియాక్ట్ అవుతాడ‌ని కూడా రాజేశ్ చెప్పాడ‌ట‌. గ‌తంలోనూ శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను చిత్రాల క‌థ‌ల విష‌యంలోనూ కొర‌టాల శివ‌పై ఇలాంటి విమ‌ర్శ‌ల‌నే ఎదుర్కొన్నాడు.

More News

‘వి’ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ‌స్టిఫికేష‌న్ ఉన్న పాత్ర చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది : సుధీర్‌బాబు

హీరోగా, నిర్మాత‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు సుదీర్ బాబు. ‘స‌మ్మోహ‌నం’ త‌ర్వాత ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో

చిత్తూరు మృతుల కుటుంబాలకు ఎవరెవరు ఆర్థిక సాయం ప్రకటించారంటే..

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా

చిత్తూరు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే.

పవన్‌ అభిమానులకు ఇండస్ట్రీ నుంచి సెకండ్ సర్‌ప్రైజ్..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ఆయన అభిమానులకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ రూపంలో ఒక గిఫ్ట్ అందింది.

మృతి చెందిన పవన్ అభిమానులకు బాసటగా అల్లు అర్జున్..

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా