'శివకాశీపురం'.. హీరోగా నాకు మంచి పేరు తెస్తుంది - రాజేష్ శ్రీ చక్రవర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, మరో సంగీత దర్శకుడు శ్రీ తనయుడు రాజేష్ శ్రీచక్రవర్తి హీరోగా రూపొందిన చిత్రం 'శివకాశీపురం'. మాస్టర్ హరి సమర్పణలో సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 3న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
హీరో రాజేష్ శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ '' మా తాతగారు, నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్స్ అయినప్పటికీ నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. మొదట నేను కళ్యాణవైభోగమే చిత్రానికి నందినిరెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఆ తర్వాత యాక్టింగ్ సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నాను. 'శివకాశీపురం' వంటి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా హీరోగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది.
సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. శివకాశీపురం అనే ఊరిలో ఉన్న కోటలో జరిగే కథే ఈ సినిమా. అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ఒక రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని చేసిన సినిమా ఇది. ఒక విషయం మనం డిస్ట్రబ్ అయితే అది లైఫ్ అంతా మనని వెంటాడుతూ ఉంటుంది. ఏ సంఘటన జరిగినా అదే గుర్తొస్తుంది. అదే ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఇందులో లవ్‌స్టోరీ కూడా వుంది. హీరోయిన్‌గా నటించిన ప్రియాంక శర్శ మంచి పెర్‌ఫార్మర్. తన క్యారెక్టర్‌కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసింది. థ్రిల్లర్ మూవీ కావడం వల్ల సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. పవన్ శేషా చాలా మంచి సంగీతాన్ని అందించారు. పాటలు ఆల్రెడీ పెద్ద హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ హరీష్ గురించి చెప్పాలంటే ఆయన మొదట స్టోరీ చెప్పినప్పుడు ఆఫ్ బీట్‌లో వున్న మంచి స్టోరీ అనిపించింది. హీరో క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. దానికి తగ్గట్టుగానే నా క్యారెక్టర్‌ని డిజైన్ చేయడం జరిగింది. హరీష్‌గారు ప్రతి సీన్‌ని చాలా అద్భుతంగా తీశారు.
మా నిర్మాత మోహన్‌బాబు పులిమామిడి గురించి చెప్పాలంటే ఆయన ఒక ఫాదర్ ఫిగర్. ఏది అడిగినా కాదనకుండా చేసేవారు. ఆయన నో చెప్పడం నేను వినలేదు. మంచిర్యాలలో షూటింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అందరి విషయంలో చాలా కేరింగ్ తీసుకున్నారు. నిర్మాత అంటే ఇలా ఉండాలి అనిపించింది. సినిమా కంప్లీట్ చేసేసి రిలీజ్‌కి వచ్చిన తర్వాత ఆ బాధ్యతను విజయ్‌వర్మగారు తీసుకున్నారు. ఆయన లేకపోతే మా సినిమాకి ఇంత ప్రమోషన్స్ వచ్చేవి కావు. చాలా థియేటర్స్‌లో రిలీజ్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారు. డెఫినెట్‌గా సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం మాకు ఉంది. ఈ సినిమా హీరోగా నాకు మంచి పేరు తెస్తుంది. నా మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే ఏదీ ఓకే చెయ్యలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్‌ట్ నేను చెయ్యబోయే సినిమా ఏమిటనేది చెప్తాను. పర్టిక్యులర్‌గా ఫలానా క్యారెక్టర్సే చేస్తాను అని చెప్పను. నటనకు అవకాశం ఉన్న ఎలాంటి క్యారెక్టర్ చెయ్యడానికైనా నేను సిద్ధం'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout