జీవితంలో మంచి - చెడూ రెండూ వుండాలి : ఆకట్టుకుంటున్న రాజేంద్రప్రసాద్ ‘సేనాపతి’ ట్రైలర్
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా, లాక్‌డౌన్ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్.. ఇప్పుడు పెద్ద మార్కెట్‌గా మారింది. యువ దర్శకులు, నటీనటులు, టెక్నీషీయన్లు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి.. సీనియర్ నటులకు సరికొత్త వేదికగా అవకాశాలను అందిస్తోంది. స్టార్లు సైతం ఒక్కొక్కరిగా ఓటీటీ బాటపడుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పుడు ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరిపోయారు నటకిరిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
కామెడీకి స్టార్ స్టేటస్‌ను తీసుకొచ్చిన ఆయన.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు. మళ్లీ వరుసగా సినిమాలలో ఛాన్సులు కొట్టేస్సతున్నారు. అయితే రాజేంద్రుడు సైతం ఓటీటీలలో అడుగుపెట్టారు. ఆహా యాప్‌లో ‘‘సేనాపతి’’ పేరుతో వస్తోన్న చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటించారు. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల, హర్షవర్దన్, రాకేందు మౌళి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'ఆహా'లో ఈ నెల 31వ తేదీ నుంచి ‘‘సేనాపతి’’ స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈరోజు సేనాపతి నుంచి ఒక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. "జీవితంలో మంచి - చెడు రెండూ చూడాలి, ఆ రెండింటి మధ్యే ఎదగాలి" అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. పోలీస్‌లకు .. రౌడీలకు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను నిర్వహిస్తూ వుంటాడు. అసలు కృష్ణమూర్తి ..సేనాపతిగా ఎందుకు మారాల్సి వచ్చిందనే దానిపై చిన్న హింట్ ఇస్తారు. అసలు అందుకు కారణమేమిటి? రహస్యంగా ఆయన దేనికోసం వెతుకుతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే 'సేనాపతి'ని చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments