పృథ్వీరాజ్ వ్యాఖ్యలకు రాజేంద్రప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ సొంత సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు అసలు ఇండస్ట్రీ తరఫున ఒక్కరంటే ఒక్కరూ కూడా జగన్ ఎందుకు కలవట్లేదు..? అంటూ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఎస్వీబీసీ చైర్మన్‌గా పృథ్వీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మరింత డోస్ పెంచి హంగామా చేశారు. అయితే ఇప్పటికే సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళీ రియాక్టయ్యి.. ఖండించారు.
మేమేం బిజినెస్‌మెన్‌లు కాదు!
తాజాగా పృథ్వీ వ్యాఖ్యలపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రియాక్ట్ అవుతూ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిని వెంటనే కలవడానికి సినీ నటులేమీ వ్యాపారవేత్తలు కాదని చెప్పుకొచ్చారు. అయినా కళాకారులు సీఎంను కలవాలన్న నిబంధన ఏమీ లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కుదురుకున్న తర్వాతే కలుస్తామని నటకిరీటీ స్పష్టం చేశారు. తనకు కూడా సీఎం జగన్‌తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
త్వరలో జగన్‌ను కలుస్తా..!
వైఎస్ జగన్‌ను రేపు అనగా శనివారం కలవాల్సి ఉందని.. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని.. రెండు మూడ్రోజుల్లో సీఎంను కలవబోతున్నట్లు రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు. ప్రజలకు తాగునీరందించే సీఎం మాకు దేవుడని సీనియర్ నటుడు చెప్పుకొచ్చారు. కాగా.. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అయితే నటికిరీటి వ్యాఖ్యలపై పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments