కేసీఆర్ చాలెంజ్ ను స్వీకరిచింన రాజేంద్రప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో 'ఆడాప్ట్ ఎ ట్రీ ఛాంలెంజ్' అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయ్‌భాస్కర్, జాగృతి ఐటీ రాష్ట్ర కన్వీనర్ దాసరి శ్రీనివాస్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షులు నటకిరీటీ రాజేంద్రప్రసాద్, వరంగల్ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్, టీవి ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ యాదవ్‌లు మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతను తీసుకున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో 'ఆడాప్ట్ ఎ ట్రీ ఛాంలెంజ్' కార్యక్రమం వివరాలు తెలిపారు. ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పచ్చదనం అంటే చెట్టు.. అమ్మ అంటే ఎంతో ఈ చెట్లు కూడా ఆంతటి ఆప్యాయతను మనకు ఇస్తాయన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను పచ్చదనం చేయాలని, ప్రతి ఒక వ్యక్తి ఒక చెట్టును పెంచాలన్నారు. చెట్టు మన జీవితంలో ఒక భాగమని... 250 కార్ల నుంచి వచ్చే కాలుష్యాన్ని ఒక చెట్టు అరికడుతుందన్నారు. కేసీఆర్ దృడ సంకల్పం రాష్ట్రవ్యాప్తంగా చెట్లు నాటడమని... హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మారాలని తన కోరిక అని చెప్పుకొచ్చారు. తనను విజయ్ భాస్కర్ ప్రపోజ్ చేస్తే, తాను ఐదుగురుని ప్రపోజ్ చేస్తున్నానన్నారు. మీరు 72 గంటల్లో తమతమ ఏరియాల్లో చెట్లను నాటాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రొడ్యూసర్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, విజయ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout