శ్రీవల్లి విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది: రజత్
Send us your feedback to audioarticles@vaarta.com
సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టడం సవాలుగా అనిపించింది. ఇదొక అరుదైన అవకాశంగా భావించాను. సినీ పరిశ్రమలో దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా కంటూ ఓ స్పెషాలిటిని క్రియేట్ చేసుకోవడమే నా లక్ష్యమని చెబుతున్నాడు యువహీరో రజత్. ఆయన కథానాయకుడిగా పరిచయమైన శ్రీవల్లి చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రజత్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
కాలేజీ రోజుల్నుంచే..
మా స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. నాకు కాలేజీ రోజుల నుంచే సినిమాలపై ఆసక్తి వుండేది. నాన్న విజయరామరాజు హైకోర్టులో క్రిమినల్ లాయర్‌గా పనిచేశారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాను కెరీర్‌గా ఎంచుకున్నాను. వైజాగ్ సత్యానంద్ ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందాను. శ్రీవల్లి సినిమా కోసం విజయేంద్రప్రసాద్‌గారు ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి సంప్రదించాను. నా ప్రొఫైల్ నచ్చడంతో సినిమాకు ఎంపిక చేశారు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు వర్క్‌షాప్ నిర్వహించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది.
శ్రీవల్లి అద్భుతానుభవం...
సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టడం సవాలుగా అనిపించింది. ఇదొక అరుదైన అవకాశంగా భావించాను. విజయేంద్రప్రసాద్‌గారి సూచనలకు అనుగుణంగా నా పాత్రకు వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నించాను. గ్రాఫిక్స్ ప్రధాన చిత్రం కావడంతో ఎక్కువ భాగాన్ని బ్లూమ్యాట్‌లో తెరకెక్కించారు. మన పక్కన లేనటువంటి వాతావరణాన్ని ఊహించుకొని నటించడం ఛాలెంజ్‌గా అనిపించింది. సినిమాలోని చివరి 20 నిమిషాల్లో వచ్చే ైక్లెమాక్స్ ఘట్టాలు అద్భుతంగా వున్నాయని ప్రశంసలొస్తున్నాయి.
చిరంజీవిగారే స్ఫూర్తి...
ఎందరో వర్థమాన నటుల మాదిరిగానే నేను కూడా చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి వచ్చాను. నా వృత్తిలో అంకితభావాన్ని ప్రదర్శిస్తూ అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి పాత్రల్లోనైనా రాణిస్తాననే నమ్మకముంది. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా యువతరాన్ని మెప్పించే వినూత్న పాత్రల్ని చేయాలనుకుంటున్నాను. శ్రీవల్లి విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తాననే నమ్మకముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com