Rajasthan Election:రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ తేది మార్పు.. ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ మినహా మిగిలిన తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్‌లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో నవంబర్ 23న రాజస్థాన్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే ఆరోజు రాజస్థానీలు పవిత్రంగా భావించే దేవ్ ఉథాని ఏకాదశి కావడంతో 50వేల కంటే ఎక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. దీంతో వ్యాపారాలతో పాటు రవాణా సమస్య తలెత్తే సమస్య ఉంటుందని.. దీని ప్రభావం పోలింగ్ శాతంపై పడుతుందని అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సీఈసీ దృష్టికి తీసుకెళ్లాయి.
నవంబర్ 25కి వాయిదా వేసిన కేంద్ర ఎన్నికల సంఘం..
ఈ విజ్ఞప్తులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదిని వాయిదా వేసింది. నవంబర్ 23న రాష్ట్రంలో భారీ సంఖ్యలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉన్నాయని. వీటి వల్ల ప్రజా రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందనే అభ్యంతరాలు వచ్చాయంది. అంతేకాకుండా పోలింగ్ శాతం కూడా తగ్గే అవకాశం ఉన్నందున ఎన్నికల తేదీని నవంబర్ 25కి మార్చుతున్నామని సీఈసీ ప్రకటన విడుదల చేసింది. ఫలితాలు మాత్రం యథావిధిగా డిసెంబర్ 3న విడుదల కానున్నాయని వెల్లడించింది.
యథాప్రకారమే మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు..
ఇక రాజస్థాన్ కాకుండా మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు యథాప్రకారమే కొనసాగనున్నాయి. ఛత్తీస్‌గఢ్ తొలి విడత ఎన్నికలు నవంబర్ 7న, రెండో విడత ఎన్నికలు నవంబర్ 17న జరుగుతాయి. అలాగే మధ్యప్రదేశ్ ఎన్నికలు నవంబర్ 17న, మిజోరం ఎన్నికలు నవంబర్ 7న , తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout