తన పెన్ పవర్‌తో గోనగన్నారెడ్డిని పాత్రను మలచిన రాజసింహ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ తొలి హిస్టారికల్ ఇండియన్ 3డి మూవీగా రూపొందిన చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో రానా చాళుక్య వీరభద్రుడు పాత్రలో నటించగా, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గో్నగన్నారెడ్డి పాత్రలో నటించాడు. రుద్రమదేవి కాలంలో ఆమెకు గోనగన్నారెడ్డి ఎలాగైతే అండదండలుగా నిలిచాడో ఈ సినిమా విషయంలో మన గోనగన్నారెడ్డి బన్ని రుద్రమదేవి సినిమా విషయంలో అండదండలందించాడు. సినిమాలో కూడా గోనగన్నారెడ్డి పాత్ర చాలా హైలైట్‌గా నిలిచింది. బన్ని ఇంటడక్షన్ నుండి లాస్ట్ సీన్ వరకు బన్ని లుక్, డైలాగ్ డెలివరీ చాలా బావుంది. తన డైలాగ్స్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఈ సినిమాలో బన్ని గోనగన్నారెడ్డి పాత్రలో నటించడానికి నిర్ణయించుకున్నప్పుడే పాత్రను చక్కగా మసలుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సాధారణంగా బందిపోటు దొంగ అయిన గోనగన్నారెడ్డి మహబూబ్ నగర్ పాలమూరు ప్రాంతానికి చెందినవాడు. అందువల్ల బన్ని తన పాత్ర చాలా బాగుండాలని డైలాగ్స్ అన్నీ పాలమూరు రూరల్ తెలంగాణ యాసలోనే డైలాగ్స్‌ను రాయించుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా రాజసింహా అనే రచయితను నియిమించుకున్నాడట. తను పాలమూరు రూరల్ తెలంగాణపై రీసెర్చ్ చేసి డైలాగ్స్‌ను అందంగా రాశాడు. గమ్ముగుండవో..., నా మొలతాడులో తాయెత్తు...వంటి డైలాగ్స్‌ను సందర్భానుసారం రాయించి పలికించిన తీరు ఆకట్టుకుంది.మొత్తం మీద రాజసింహ రచయితగా తన పెన్ పవర్‌ను చూపించాడనడంలో సందేహం లేదు. రచయితగా ఉన్న రాజసింహ ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప అనే సినిమాతో దర్శకుడుగా మారుతున్నాడు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా నిర్మితమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments