హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్‌ విడుదల..

  • IndiaGlitz, [Thursday,October 22 2020]

హీరో రాజశేఖర్ హెల్త్ బులిటెన్‌ను సిటీ న్యూరో సెంటర్ వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం రాజశేఖర్‌కు ఐసీయూలో నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. ‘‘కోవిడ్ 19 చికిత్స నిమిత్తం సిటీ న్యూరో సెంటర్ ఫర్ సర్వీస్‌లో జాయిన్ అయిన డాక్టర్ వి. రాజశేఖర్‌కు ప్రస్తుతం ఐసీయూలో నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన కండీషన్ నిలకడగా ఉంది. ట్రీట్‌మెంట్‌కు ఆయన బాగానే స్పందిస్తున్నారు. మా ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యబృదం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది’’ అని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ వెల్లడించారు.

కాగా.. గురువారం ఉదయం రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మక సోషల్ మీడియాలో తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రకటన చేసింది. కోవిడ్ నుంచి కోలుకునేందుకు నాన్న తీవ్రంగా పోరాటం చేస్తున్నారని పేర్కొంది. కరోనా నుంచి నాన్న వేగంగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని కోరింది. శివాత్మక ప్రకటనతో రాజశేఖర్ ఆరోగ్యంపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మరోమారు తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ... రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

More News

వరుస ప్యాన్‌ ఇండియా చిత్రాలతో వరల్‌వైల్డ్‌గా ఇమేజ్‌ పెంచుకుంటోన్న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌

రెబల్‌స్టార్‌ ‌ప్రభాస్‌..ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్‌లోనే కాదు ఎంటైర్‌ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది.

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్, హత్య.. నిందితుల ఎన్‌కౌంటర్?

మహబూబాబాద్‌కు చెందిన ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి.. నాలుగు రోజుల పాటు బాలుడి తల్లిదండ్రులకు, పోలీసులకు చుక్కలు చూపించారు.

వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'రామరాజు ఫర్‌ భీమ్‌'

ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం).

ఒకసారి అలా.. వెంటనే మరోలా.. హీరో రాజశేఖర్ ఆరోగ్యం అసలెలా ఉంది?

హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలసిందే. ఈ విషయాన్ని రాజశేఖర్ ఇటీవల ట్విట్టర్ వేదికగా స్వయంగా తెలిపారు.

మాజీ హోంమత్రి నాయిని కన్నుమూత.. మధ్యాహ్నం అంత్యక్రియలు

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.