హీరో రాజశేఖర్ ఇంట్లో విషాదం.. ఆయన తండ్రి వరదరాజన్ గోపాలన్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
దీపావళి పండుగ వేళ సీనియర్ హీరో డా. రాజశేఖర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తండ్రి వరదరాజన్ గోపాల్ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన. గురువారం సాయంత్రం హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని రాజశేఖర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో చెన్నైకు తీసుకువెళ్లారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు రాజశేఖర్‌కు తమ సంతాపం తెలియజేశారు.
వరదరాజన్ గోపాల్ తండ్రి స్వస్థలం తమిళనాడు. ఆయన తమిళనాడు పోలీస్ శాఖలో పలు హోదాల్లో పనిచేశారు. చెన్పై డీసీపీగా పదవీ విరమణ పొందారు. వరదరాజన్ గోపాల్‌కు మొత్తం ఐదుగురు సంతానం. వీరిలో డాక్టర్ రాజశేఖర్ రెండోవారు. ఆయనకు ఇద్దరు సోదరులు, సోదరీమణులు ఉన్నారు. కొన్నేళ్లక్రితం రాజశేఖర్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే... రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్'ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లలిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముస్కాన్ హీరోయిన్ నటించింది. అలాగే 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో 'పరమాణువు' కూడా చేస్తున్నారు రాజశేఖర్. ఈ సినిమాను త్వరలో సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ఈ సమయంలో తండ్రి మరణించడంతో ఆయన కొన్ని రోజులు షూటింగ్‌కు దూరంగా వుండే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments