తమిళ్ సినిమా చేయనున్న రాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆహుతి, అంకుశం, మగాడు వంటి చిత్రాల్లో పవర్ క్యారెక్టర్స్‌తో మెప్పించిన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజశేఖర్ ఇప్పుడు పిఎస్వి గరుడ వేగ 125.18 సినిమాలో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనపడుతున్నాడు. ఈ సినిమా పూర్తి కాక ముందే రాజశేఖర్ తమిళ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
సరోజ, బిరియాని వంటి చిత్రాలను తెరకెక్కించిన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. రీసెంట్గా స్క్రిప్ట్ విన్న రాజశేఖర్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే సినిమా సెట్స్‌లోకి వెళుతుందట. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments