రాజశేఖర్.. మూడు కొత్త ప్రొజెక్ట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు పది సంవత్సరాల విరామం తర్వాత విజయాన్ని చవిచూసారు ప్రముఖ కథానాయకుడు డా.రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'పి.ఎస్.వి గరుడవేగ 126.18 ఎమ్' చిత్రంతో ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు ఈ సీనియర్ హీరో. ఈ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాజశేఖర్ వరుస ప్రాజెక్టులను గుట్టు చప్పుడు కాకుండా లైన్లో పెట్టేసుకుంటున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
'గరుడవేగ' నిర్మాణ సంస్థ జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై తన తదుపరి ప్రొజెక్టు చేయబోతున్నారని...ప్రముఖ దర్శకుడు మణిరత్నం వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన గోపి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారని సమాచారం. అలాగే శాండల్‌వుడ్ డైరెక్టర్ నాగశేఖర్ డైరెక్షన్లో రూపుదిద్దుకోబోతున్నసినిమాలో కూడా ఒక కీలక పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీలో తన కూతురు శివాని కథానాయికగా నటిస్తుండగా...ఓ యంగ్ హీరో కథానాయకుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కథను మలుపు తిప్పే పాత్రగా రాజశేఖర్ చేసే పాత్ర ఉంటుందని తెలిసింది. ఇక ముచ్చటగా మూడో ప్రొజెక్టుని కూడా రాజశేఖర్ లైన్లో పెట్టినట్లు టాలీవుడ్ టాక్. త్వరలోనే వీటికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com