నాకు ఎటువంటి గాయాలు కాలేదు: డా.రాజశేఖర్

  • IndiaGlitz, [Wednesday,November 13 2019]

ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.

రాజశేఖర్ మాట్లాడుతూ మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు అని అన్నారు.

More News

సుప్రీం సంచలన తీర్పు.. ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ

దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇకపై సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి రానుంది. ఆర్టీఐ పరిధిలో సీజేఐ కార్యాలయం వస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

'ప్రతిరోజు పండగే' ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి

చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా

అసలేం జరిగింది..: రాజశేఖర్ రోడ్డుప్రమాదంపై జీవిత వివరణ

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదం: హీరో రాజశేఖర్‌పై కేసు నమోదు

టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద ప్రమాదనికి గురైన విషయం తెలిసిందే.

పవన్‌కు కొత్తపేరు పెట్టిన ఏపీ మంత్రి!

ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంగ్లీష్ బోధన’ వ్యవహారాలు కాస్త వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించడంతో రెండు పార్టీల మధ్య ఈ వివాదం మరింత పెరిగింది.