‘మా’ పదవికి రాజశేఖర్ రాజీనామా!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి-యాంగ్రీస్టార్ రాజశేఖర్.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో భాగంగా మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో సజావుగా జరుగుతున్న కార్యక్రమం రసాభసగా మారింది. ఒకరిపై ఒకరు కోపతాపాలు చూపించుకోవడంతో మరోసారి చిరు వర్సెస్ రాజశేఖర్గా పరిస్థితులు మారాయి. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
‘మా’ ఉపాధ్యక్ష పదవిలో ఇకపై కొనసాగలేనని.. తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖ విడుదల చేశారు. ఆ లేఖను ‘మా’ పెద్దలకు పంపారు. అయితే.. ఈ లేఖలో మాత్రం తాను రాజీనామా చేయడానికి.. మా అధ్యక్షుడు నరేశ్ వైఖరే.. తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన లేఖలో రాసుకొచ్చారు. నరేష్ తీరుకు నిరసనగానే రాజీనామా చేస్తున్నట్లు రాజశేఖర్ సంచలన ప్రకటన చేశారు. రాజశేఖర్ రాజీనామాపై ‘మా’ సభ్యులు, ఇండస్ట్రీ పెద్దలు.. మరీ ముఖ్యంగా చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments