నవంబర్ 3న 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చలన చిత్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఎ) పై ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. ఓ సిన్సియర్ ఎన్ఐఎ ఆఫీసర్ దేశం కోసం, తన కుటుంబం కోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ' పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరైన యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజశేఖర్ హీరోగా సినిమా రూపొందుతోంది. మంచి కథ, పవర్‌పుల్ హీరోయిజం, హృదయాన్ని తాకే ఎమోషన్స్, ఉత్కంఠత రేపే సన్నివేశాలతో సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. మగాడు అంత పవర్‌ఫుల్ రోల్‌లో రాజశేఖర్‌ను ప్రెజంట్ చేయాలని దర్శకుడు ప్రవీణ్ సత్తారు పడ్డ తపన తెరపై సినిమా రూపంలో కనపడుతుంది.
జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై 25 కోట్ల భారీ బడ్జెట్‌తో కోటేశ్వర్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరికొత్త లుక్‌లో కనపడనున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా నిర్మాత కోటేశ్వర్ రాజు మాట్లాడుతూ - "మా బేనర్‌లో వస్తోన్న తొలి సినిమా 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'. సినిమా ప్రారంభం నుండి ప్రతి పాత్రను రివీల్ చేస్తూ, దేనికదే ప్రత్యేకం అనేలా అందరిలో ఆసక్తిని కలిగించేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తూ వచ్చాం. హీరోయిన్ పూజా కుమార్ ఇందులో గృహిణి పాత్రలో కనిపించనున్నారు. అదిత్ అరుణ్ కీలక పాత్రలో నటించారు. శ్రద్ధాదాస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. కిషోర్ మెయిన్ విలన్‌గా నటించారు. పోసాని కృష్ణమురళి, రవివర్మ, నాజర్, పృథ్వీ, షాయాజీ షిండే తదితరులు సినిమాలో నటించారు. ఇలా భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో మేకింగ్‌లో ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా సినిమాను హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించాం. ప్రెస్జీజియస్‌గా నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
రాజశేఖర్, పూజా కుమార్, ఆదిత్, కిషోర్, నాజర్, ఆదర్శ్, శత్రు, రవిరాజ్‌లు ప్రొఫెషనల్ కిల్లర్స్ పాత్రలో కనపడనున్నారు. శ్రీనివాస్ అవసరాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాలజిస్ట్ పాత్రలో, పృథ్వీ నింఫోమానియక్ పేషెంట్‌గా, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే పొలిటిషియన్స్ పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments