డా. రాజశేఖర్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో 'మర్మాణువు'

  • IndiaGlitz, [Thursday,March 25 2021]

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. దీనికి 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకుడు. విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక నిర్మించనున్నారు.

దర్శకుడు వెంకటేష్ మహా (మార్చి 25 - గురువారం) పుట్టినరోజు సందర్భంగా... గురువారం సినిమా ప్రకటించడంతో పాటు చిత్రానికి 'మర్మాణువు' టైటిల్ ఖరారు చేసినట్టు నిర్మాతలు తెలియజేశారు. వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో రాజశేఖర్ గారి క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది త్వరలో వెల్లడిస్తాం అని శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి చెప్పారు.

'మర్మాణువు' చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), నిర్మాణ సంస్థలు: పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్, సంగీత దర్శకుడు: మిక్కీ జే మేయర్, నిర్మాతలు: శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, విజయ ప్రవీణ పరుచూరి, రచన-దర్శకత్వం: వెంకటేష్ మహా.

More News

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 50 వేల ఖాళీల భర్తీ

ఎమ్మెల్యేలు, మాజీ శానస సభ్యులకు సంబధించిన పెన్షన్ బిల్లు సవరణను ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెట్టగా..

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు: జగన్

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. ఒకప్పుడు మారుమోగిన ఈ పేరు.. ఆ తరువాతి కాలంలో ఈ పేరు మరుగున పడిపోయింది.

‘లవ్‌స్టోరీ’ సంగతి తర్వాత.. చైతూ పెర్ఫార్మెన్స్ మాత్రం అదుర్స్..

అక్కినేని నాగచైతన్య,  సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’.

అప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్, గుండె సంబంధిత సమస్యలొచ్చాయి: రానా

రానా దగ్గుబాటి హీరోగా రెండు ఆసక్తికర కథాంశాలతో సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి ‘అరణ్య’ కాగా..

విలన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నాగబాబు!

మెగా బ్రదర్‌ నాగబాబు ఇటీవలి కాలంలో వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా దృష్టి సారించారు.