ఒకసారి అలా.. వెంటనే మరోలా.. హీరో రాజశేఖర్ ఆరోగ్యం అసలెలా ఉంది?
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలసిందే. ఈ విషయాన్ని రాజశేఖర్ ఇటీవల ట్విట్టర్ వేదికగా స్వయంగా తెలిపారు. తన కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారని.. తను, జీవిత మాత్రం కరోనాకు ఇంకా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నామని వెల్లడించారు. త్వరలోనే తామిద్దరం కూడా కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిపోతామని రాజశేఖర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కానీ ఇవాళ సడెన్‌గా ఆయన కూతురు శివాత్మిక తన తండ్రి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే శివాత్మిక మరో ట్వీట్ చేసింది. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కోలుకుంటున్నారని.. ఫేక్ న్యూస్ వైరల్ చేయవద్దని ఆమె రెండో ట్వీట్లో కోరారు. ‘‘కోవిడ్‌తో నాన్న పోరాటం కాస్త కష్టంగా మారింది. అయినా ఆయన ధైర్యంగానే పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమ, మద్దతు మమ్మల్ని కాపాడతాయని మేం బలంగా నమ్ముతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని మీరందరూ దయచేసి ప్రార్థనలు చేయండి. మీ ప్రేమతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారు’’ అని శివాత్మిక పేర్కొంది.
మరో ట్వీట్లో ‘‘మీ ప్రేమాభిమానాలకు నేను ధన్యవాదాలు చెప్పి సరిపెట్టలేను. కానీ నాన్న పరిస్థితి క్రిటికల్‌గా ఏమీ లేదని తెలుసుకోండి. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రస్తుతం కోలుకుంటున్నారు. మేము మీ నుంచి పాజిటివిటిని కోరకుంటున్నాం. మరోసారి థాంక్యూ. పానిక్ చేయకండి. దయచేసి ఫేక్ న్యూస్‌ని వ్యాప్తి చేయకండి’’ అని శివాత్మిక ట్వీట్ చేసింది. దీంతో అసలు రాజశేఖర్ ఆరోగ్యం ఎలా ఉందో తెలియక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండు ట్వీట్లతో శివాత్మిక నెటిజన్లను కన్ఫ్యూజ్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com