బర్త్‌డే సందర్భంగా రాజశేఖర్ ఎమోషనల్.. కొత్త సినిమా ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో రాజశేఖర్ 2017లో ఎంట్రీ ఇచ్చి ‘గరుడవేగ, కల్కి’ వంటి సినిమాలతో మరోమారు తన స్టామినాను రుజువు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజశేఖర్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన షూటింగ్ నేడు ప్రారంభమైంది. రాజశేఖర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ టైటిల్ పోస్టర్‌ను బట్టి చూస్తే మరో పవర్ఫుల్ చిత్రంలో రాజశేఖర్ నటించనున్నట్టు తెలుస్తోంది.
గుబురుగా కాస్త నెరిసిన గడ్డంతో రాజశేఖర్ కనిపిస్తున్నారు. ‘శేఖర్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా రాజశేఖర్ పెట్టిన ఒక ఎమోషనల్ పోస్టుతో ఒక చిన్న వీడియోను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టులో.. ‘‘ప్రియాతి ప్రియమైన నన్ను ప్రేమించే నా వాళ్లందరికీ.. నేను ప్రేమించే నా అభిమానులకి.. అతి భయంకరమైన కోవిడ్-19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకెళ్లినా.. మీ ప్రేమ, అభిమానం, మరియు నిరంతర ప్రార్థనలతో నన్ను మళ్లీ ఈ నా పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా ప్రారంభించే స్థితికి తీసుకొచ్చాయి. కనిపించని దేవుడికి, కనిపించే దేవుళ్లైన మీకు సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను’’ అని రాజశేఖర్ తెలిపారు.
‘కల్కి’ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తరువాత ఈ చిత్రాన్ని రాజశేఖర్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా నేడు ప్రారంభమైంది. మలయాళంలో హిట్టయిన 'జోసెఫ్' అనే సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి లలిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మూలకథకు మార్పులు చేర్పులు చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com