హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న రాజశేఖర్ కుమార్తె..!
Send us your feedback to audioarticles@vaarta.com
డా.రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తె శివాని ఎంట్రీ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ తండ్రిగా శివాని కుమార్తెగా ఓ సినిమా అనుకున్నారు కానీ ఎందుకనో ఈ ప్రాజెక్ట్ తెర పైకి రాలేదు. అయితే...ఇప్పుడు శివానిని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నాగశౌర్య హీరోగా వైవిధ్యంగా ఉండే థ్రిల్లర్ ను నూతన దర్శకుడితో తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతుందట.
ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. పెద్దగా హడావిడి లేకుండా మిడియమ్ బడ్జెట్ మూవీ అయిన ఈ చిత్రం ద్వారా శివానిని హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంటున్నారట రాజశేఖర్ జీవిత. మరి...ఇదే కనుక నిజమైతే శివాని నటిగా ఎంత వరకు రాణిస్తుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments