ట్విట్టర్లో మహిళ వర్సెస్ యాంగ్రీస్టార్.. ఫైనల్‌గా రాజశేఖర్ క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులు, నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. ఈ సోషల్ మీడియానే నటీనటుల సినిమాలను సూపర్ డూపర్ హిట్ చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంతే రీతిలో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఎవరైనా హీరోల గురించి ఫలానా అని వార్తలుగానీ.. పుకార్లుగానీ వస్తే ట్విట్టర్, ఫేస్బుక్లో ట్యాగ్ చేయడం.. పదే పదే ప్రశ్నించడం వారికి కాసింత ఇబ్బందిగానే అనిపిస్తున్నాయి.
అసలేం జరిగింది..!
తాజాగా.. టాలీవుడ్ యాంగ్రీస్టార్ రాజశేఖర్‌కు ఇలాంటి ఒక ఘటనే ఎదురైంది. తన వాహనానికి సంబంధించి రూ. 18వేల చలానాలను కట్టలేదంటూ ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ క్లిప్పింగ్‌ను పట్టుకున్న ఓ మహిళ ట్విట్టర్ల్ యాంగ్రీస్టార్కు ట్వీట్ చేసింది. ‘రూ. 18వేల చలానాలు పెండింగ్‌లో ఉన్నా యాక్టర్ రాజశేఖర్ ఫ్రీగా తిరుగుతున్నారని... దీనిపై ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని సదరు మహిళ ప్రశ్నించారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్తూ ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆమె సెలబ్రిటీలపై మండిపడ్డారు. అయితే మహిళ ట్వీట్ చూసిన రాజశేఖర్ వెంటనే స్పందించారు. ఒకానొక క్రమంలో ట్విట్టర్ వేదికగా మహిళ వర్సెస్ యాంగ్రీస్టార్గా మారింది.
యాంగ్రీస్టార్ క్లారిటీ...
'డోంట్ వర్రీ.. నేను ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించలేదు. చలానాలన్నీ కట్టేశాను. ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న చలానాలన్నీ కట్టేశాను. భవిష్యత్తులో కూడా నా చలానాలేవీ పెండింగ్‌లో ఉండవు’ అని రాజేశేఖర్ రిప్లై ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన.. తప్పు చేసిన వారెవరైనా ఫ్రీగా తిరగలేరని ఈ సందర్భంగా యాంగ్రీస్టార్ చెప్పుకొచ్చారు. కాగా.. చలనాలన్నీ చెల్లించానని రాజశేఖర్ చెప్పడంతో ఆయన అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ‘శభాష్ సార్’ అంటూ మెచ్చుకుంటున్నారు.
I have paid my challans in the past and I will pay my challans now and in the future. Nobody can run "Scott Free" when they do something wrong.
— Dr.Rajasekhar (@ActorRajasekhar) July 31, 2019
I haven't refused to pay nor have I ignored this.
If the police haven't reacted that clearly means we are in talks. https://t.co/Np5tdiaWp0
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments