వరుస చిత్రాల్లోరాజశేఖర్
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ హీరో రాజశేఖర్ రీసెంట్‌గా విడుదలైన `పిఎస్‌వి గరుడ వేగ 126.18 ఎం` సినిమా సక్సెస్ అందుకుని ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమా తర్వాత వెంటనే సినిమాలు చేయకుండా వేచి చూసే దోరణిని ప్రదర్శించిన రాజశేఖర్ మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడట. అందులో ఒకటి జూన్ లేదా జూలైలో మొదలవుతుందని అంటున్నారు.
ఈ సినిమాను అ! సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాకు కల్కి అనే టైటిల్ పరిశీలనలో ఉందట. అలాగే ఐశ్వర్య ధనుశ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే ఓ మల్టీస్టారర్ చిత్రంలో కూడా రాజశేఖర్ నటించబోతున్నాడని సమాచారం. చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్ కమ్ బ్యాక్ అవుతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments