వ‌రుస చిత్రాల్లోరాజ‌శేఖ‌ర్‌

  • IndiaGlitz, [Thursday,April 26 2018]

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ రీసెంట్‌గా విడుద‌లైన 'పిఎస్‌వి గ‌రుడ వేగ 126.18 ఎం' సినిమా స‌క్సెస్ అందుకుని ట్రాక్‌లోకి వ‌చ్చాడు. ఈ సినిమా త‌ర్వాత వెంట‌నే సినిమాలు చేయ‌కుండా వేచి చూసే దోర‌ణిని ప్ర‌ద‌ర్శించిన రాజ‌శేఖ‌ర్  మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడ‌ట‌. అందులో ఒక‌టి జూన్ లేదా జూలైలో మొద‌లవుతుంద‌ని అంటున్నారు.

ఈ సినిమాను అ! సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. ఈ సినిమాకు కల్కి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌. అలాగే ఐశ్వ‌ర్య ధ‌నుశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అలాగే ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో కూడా రాజ‌శేఖ‌ర్ న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. చాలా గ్యాప్ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ క‌మ్ బ్యాక్ అవుతున్నాడు.