విలన్‌గా రాజశేఖర్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ‘ఛలో’ హీరోయిన్ రష్మిక మండన్న పేరు కూడా వినిపిస్తోంది. ఈ ముగ్గురిలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ సరసన నటించే హీరోయిన్లు ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే డా. రాజశేఖర్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
రాజమౌళి సినిమాల్లో విలన్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో రాజశేఖర్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో సరైన హిట్ లేని రాజశేఖర్‌కి ‘పిఎస్‌వి గరుడవేగ’తో సూపర్‌హిట్ వచ్చింది. రాజమౌళి సినిమాలో రాజశేఖర్ విలన్ అనే వార్త నిజమే అయితే అతనికిది శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ సోదరుల్లా నటిస్తారని సమాచారం. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com